హెబ్రీయులు తెర లోపల
₹220.00
యేసు క్రీస్తు ఏకైక యాగము ద్వారా, సంపూర్ణ విమోచన మరియు పరిపక్వత సాధ్యమని, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక సూచించుచున్నది. లేవియుల యాజకత్వమును క్రీస్తునెరవేర్చుట ద్వారా, నూతన నిబంధన యెక్క శ్రేష్టత తేటపడుచున్నది.
మొదటి శతాబ్దపు క్రైస్తవులు, ‘ఒకసారి వెలింగింపబడి’ మరియు ‘పరిశుద్దాత్మలో పాలివారై’న విశ్వాసులకు ఈ పత్రిక వ్రాయబడియున్నది. ఇందువలన, నేటికి వర్తింపదు అని అనుకొనరాదు. క్రైస్తవ విశ్వాసము యొక్క మూలపాఠములను, ఈ ప్రశస్తమైన పత్రిక తెరచి చూపించుచున్నది.
పరిశుద్ధ లేఖనములను పఠించగోరిన, ఏ తీవ్రమైన విద్యార్థికైనను సహాయపడు ఈ గ్రంధమును డా|||బ్రయెన్ జె. బెయిలీ నలభై సంవత్సరముల వ్యక్తిగత అనుభవముతో, చాకచక్యముగా సమకూర్చిరి. మీ వ్యక్తిగత ధ్యానమునందు ఈ గ్రంధమును ఉపయోగింపనారంభించినప్పటి నుండి దీనియందు క్రీస్తు వ్యక్తిత్వము యొక్క నాణ్యతను చూడగలరు.
దేవుని ప్రజలను తెరలోపలగల అతిపరిశుద్ద స్థలములోనికి ప్రవేశపెట్టుట, హెబ్రీ యులకు వ్రాసిన ఈ పత్రిక యొక్క ఉద్దేశ్యమైయున్నది. అనగా మన హృదయపు మాంసపు పలకలపై దేవుని ధర్మశాస్త్రము వ్రాయబడుట. అలా చేయుట ద్వారా దేవుని మహిమ పరచి, నూతన నిబంధన ఆశయమును నెరవేరుస్తాము.
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ (1925-2012) అంతర్జాతీయ సీయోను సహవాసం, సియోను పరిచర్య పాఠశాల మరియు సీయోను క్రైస్తవ విశ్వవిద్యాలయమునకు స్థాపకులు. సుమారు 60 సం॥లు పరిచర్యలో కొనసాగి 80 దేశములలో తన ఉనికిని తెలిపారు. తాను ప్రఖ్యాత రచయిత మరియు తన జీవితకాలములో 80 గ్రంధములకు పైగా రచించారు.
1284 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.