ఫిలిప్పీయులు
₹130.00
ఫిలిప్పీయులు
గురిని చేరుట
ఇది ఫిలిప్పీయులకు పౌలు వ్రాసిన పత్రిక యొక్క వ్యాఖ్యానము. క్రీస్తు పై కేంద్రీకరించబడిన ఈ పత్రిక రోమా చెరసాలలో పౌలు బంధీగా ఉన్నప్పుడు వ్రాయబడినది. తాను ఇబ్బందులలో ఉన్నప్పటికీ, క్రైస్తవ సంతోషము మరియు కొన్ని క్రైస్తవ జీవిత నియమములను గూర్చి వివరించుచున్నాడు. ఈ హేతువుచేత ఫిలిప్పీయుల గ్రంథము క్రైస్తవునికి తేజోవంతమైన నిరీక్షణను ఇచ్చుచున్నది. మనలను మార్చగలుగు ఏకైకవాడైన యేసుక్రీస్తు యందు మన విశ్వాసము వేరుపారియుండుట వలననైన నిరీక్షణ, ఇందు ఉన్నది.
ఈ క్లుప్త వివరణలో యేసుక్రీస్తు పాపరహితమైన, త్యాగపూర్వకమైన జీవితము ద్వారానే మనము పరిపక్వతకు చేరుకోగలమని డా. బ్రాయెన్ జె. బెయిలీ వివరించుచున్నారు. కేవలము క్రీస్తు ద్వారానే మనము శరీరమును జయించి, గురిని చేరుకోగలము మరియు ఆయనను ఎరుగుటను బట్టి, ఆయన పోలికచొప్పున మార్చబడగలమని నిరీక్షించగలము.
ఈ గ్రంథములో అనేక ప్రశ్నలకు సమాధానములు ఉన్నవి. వీటిని పఠించుచుండగా మీరు సవాలు చేయబడుదురుగాక :
* క్రీస్తు కొరకు జీవించుట.
* క్రీస్తుకి కలిగిన మనస్సు కలిగియుండుట
* దేవుని శక్తి కొరకు సిద్ధపడుట
+ శ్రమల యందు సరైన వైఖరి కలిగియుండుట
* క్రీస్తుని సన్నిహితముగా ఎరుగుట
* క్రీస్తు ద్వారా నిజమైన విజయమును సాధించుట
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ అంతర్జాతీయ సియోను సహవాసము, సియోను పరిచర్య పాఠశాల మరియు సియోను విశ్వ విద్యాలయమునకు అధ్యక్షునిగా ఉన్నారు. గత యాభై సంవత్సరములలో నూరు దేశములలో పరిచర్య చేస్తూ దేవుని మార్గములలో నడుచుట, ఆథ్యాత్మిక సియోను పర్వతముకు చేర్చు పరిశుద్ధమైన మార్గములో నుండుట విశ్వాసులకు బోధిస్తున్నారు.
435 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.